2014 ఎన్నికల ప్రచారంలో బిజెపి ప్రధాన అస్త్రం నల్లధనాన్ని తిరిగి దేశం లోకి తీసుకువచ్చి ప్రతి ఒక్కరి అకౌంట్లో 15 లక్షలు జమ చేస్తామని వాగ్దానం. ఈ మాటలు బాగా నమ్మిన బిజెపి కార్యకర్తలు అహర్నిశలు పని చేసి బిజెపి ప్రభుత్వం ఏర్పాటు అయ్యేలాగా చేశారు. అధికారంలోకి వచ్చిన తర్వాత దీని వైపు వడివడిగా అడుగులు పడ్డాయి. కానీ అనుకున్న స్థాయిలో దీని నుంచి ఫలితం రాలేదని మనము చెప్పాలి. కానీ అందరి వివరాలు ఇవ్వకపోయినా స్విస్ బ్యాంకులో నల్ల ధనం దాచుకున్న భారతీయులు వివరాలు కొన్ని వరకు భారత ప్రభుత్వం రాబట్టింది అనే చెప్పాలి.

 

 కానీ అవి అనుకున్న స్థాయిలో లేకపోవడం భారతీయులకు ఎంతో నిరాశ కలిగించింది .ఇప్పుడు భారతం ప్రజలకు ఆర్థిక శాఖ మరో షాక్ ఇచ్చింది. స్విస్ బ్యాంకు నల్లధన దాచుకున్న భారతీయులు వివరాలు సమాచార హక్కు చట్టం కింద ఇవ్వలేమని ఆర్థిక శాఖ స్పష్టం చేసింది. స్విస్ తో పాటు ఇతర దేశాల్లో దాచిన నల్లధనం వివరాలు ఇవ్వలేనని పేర్కొన్నారు

 

స్విట్జర్లాండ్ ప్రభుత్వం తో ఈ వివరాలను గోప్యంగా ఉంచాలని నిబంధన ఉండటంతోనే ఈ వివరాలు ఇవ్వలేనని ఆర్థిక శాఖ వెల్లడించింది. స్విట్జర్లాండ్ ప్రభుత్వంతో కుదిరిన ఒప్పందం ప్రకారం సమాచారం మొత్తం గోప్యంగా ఉంచాలి అని ఉంది. కాబట్టి పన్ను సంబంధిత వివరాలు అలాగే ఇతర దేశాల నుంచి వచ్చిన వివరాలను ఆర్టీఏలో మినహాయింపు ఉన్న విషయం మరోసారి ప్రభుత్వం గుర్తు చేసింది.

 

ఒక విలేకరి ఈ దరఖాస్తు చేసుకున్నట్లు తెలుస్తోంది. ఇంతకుముందు నల్లధనం దాచుకునేందుకు స్విస్ బ్యాంకులో స్వర్గధామంగా మారాయని ఆరోపణలు ఎక్కువగా వినబడ్డాయి. ఆ తర్వాత చాలా మంది స్విస్ బ్యాంకులో తమ అకౌంట్లు మూసివేసి పనామా దీవులు లాంటి చిన్న దేశాల్లో నల్ల ధనం దాచి పెట్టడం మొదలు పెట్టారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: