దేశంలో కరోనా మహమ్మారి విజృంభిస్తున్న తరుణంలో రష్యా నుంచి తొలి కరోనా వ్యాక్సిన్ విడుదల కావడంతో ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు. అయితే రష్యా వ్యాక్సిన్ విషయంలో శాస్త్రవేత్తల సందేహాలే నిజమయ్యాయి. రష్యా తొలి కరోనా వ్యాక్సిన్ లో భయంకరమైన సైడ్ ఎఫెక్ట్స్ బయటపడ్డాయని తెలుస్తోంది. ఈ విషయం తెలిసిన రష్యా శాస్త్రవేత్తలు హడావిడిగా మరో కరోనా వ్యాక్సిన్ ను విడుదల చేయడానికి సిద్ధమవుతున్నారు.
 
ప్రపంచంలో అందరి కంటే ముందు వ్యాక్సిన్ ను అందుబాటులోకి తెచ్చామని గొప్పలకు పోయిన రష్యాకు ఆ వ్యాక్సిన్ వల్ల చెడ్డ పేరు వస్తోంది. అతి తక్కువ మందిపై క్లినికల్ ట్రయల్స్ నిర్వహించి వ్యాక్సిన్ ను విడుదల చేయడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. శాస్త్రవేత్తలు ఆశించిన స్థాయిలో తొలి కరోనా వ్యాక్సిన్ ప్రభావం చూపడం లేదని దీంతో రష్యా మరో వ్యాక్సిన్ ఎపివాక్ కరోనాపై దృష్టి పెట్టిందని తెలుస్తోంది.
 
రెండో వ్యాక్సిన్ కు సంబంధించిన క్లినికల్ ట్రయల్స్ వచ్చే నెల చివరి నాటికి పూర్తి కానుండగా ఈ వ్యాక్సిన్ ను కూడా తక్కువ మందిపైనే ప్రయోగించినట్టు తెలుస్తోంది. ఈ వ్యాక్సిన్ ను 57 మంది వాలంటీర్లపై ప్రయోగించగా వాళ్లలో ఎలాంటి దుష్ప్రభావాలు కనిపించలేదని రష్యా చెబుతోంది. వ్యాక్సిన్ 14 నుంచి 21 రోజుల వ్యవధిలో రెండు ఇంజెక్షన్లు ఇచ్చిన తరువాత రోగనిరోధక ప్రతిస్పందనను ఉత్పత్తి చేయడమే లక్ష్యంగా పెట్టుకున్నట్టు రష్యా చెబుతోంది.
 
అయితే రష్యా మరో వ్యాక్సిన్ ను తెచ్చినా ఆ వ్యాక్సిన్ ను నమ్మే స్థితిలో ప్రజలు లేరు. రష్యా దేశ వైద్యులు, ప్రజలు వ్యాక్సిన్ ను వేయించుకోవడానికి మొగ్గు చూపడం లేదంటే వ్యాక్సిన్ పనితీరు గురించి సులభంగానే అర్థమవుతుంది. దీంతో అందరి చూపు ఆక్స్ ఫర్డ్ ఆస్ట్రాజెనెకా, మోడెర్నా వ్యాక్సిన్లపై ఉంది. ఈ సంవత్సరం చివరినాటికి ఈ వ్యాక్సిన్లు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది. రష్యా వ్యాక్సిన్ వల్ల భయంకరమైన సైడ్ ఎఫెక్ట్స్ బారిన పడే అవకాశం ఉండటంతో ఈ వ్యాక్సిన్ ప్రమాదకరం అని నిపుణులు చెబుతున్నారు.



మరింత సమాచారం తెలుసుకోండి: