చైనా తీరు ప్రపంచ వ్యాప్తంగా రోజురోజు కు చర్చనీయాంశం గా మారుతున్న విషయం తెలిసిందే. ఏదో ఒకటి చేస్తూ ప్రపంచం ముందు చులకనగా మారిపోతూనే ఉంది చైనా. సరిహద్దు ల్లో హద్దు దాటితే ఎలాంటి దేశమైన సహించదు. ఏకంగా సరిహద్దు నిబంధనల ను ఉల్లంఘించి తమ దేశ సరిహద్దు లోకి వచ్చిన దేశాలకు స్ట్రాంగ్ వార్నింగ్ ఇస్తూ ఉంటాయి అన్ని దేశాలు  . అయినప్పటికీ  చైనా మాత్రం ఇప్పటికే ప్రాదేశిక జలాల విషయంలో వివిధ దేశాలను రెచ్చగొట్టే విధంగా వ్యవహరిస్తూనే ఉంది.



 మొన్నటికి మొన్న జపాన్ కు సంబంధించిన సముద్రజలాల్లో కి వెళ్లిన చైనాకు జపాన్ స్ట్రాంగ్ వార్నింగ్ ఇవ్వడంతో తోకముడిచి  వెనక్కి వచ్చింది చైనా . అయితే ఇటీవలే ఓ చిన్న దేశం పై తక్కువ  అంచనా వేసి సముద్రజలాల్లో కి వెళ్ళిన చైనా కి భారీ షాక్ ఇచ్చింది ఆ  చిన్నదేశం. మాములుగా  చైనా పెద్ద దేశాల విషయంలో కాస్త కంట్రోల్ గానే ఉన్నప్పటికీ చిన్న దేశాల విషయంలో మాత్రం ఎప్పుడూ  సరిహద్దుల్లోకి వెళ్తూ రెచ్చగొడుతూ ఉంటుంది చైనా.



 తాజాగా ఇక్కడ ఇలాంటిదే చేసింది కానీ చైనా కు ఊహించని షాక్ తగిలింది. ఆస్ట్రేలియా సమీపంలో  పపువా న్యూ గినియా అనే ఒక చిన్ని దేశం ఉంది. అయితే ఆ దేశ  జలాల నుంచి వెళ్లిన చైనా  చిన్ని దేశమే కదా.. ఏం చేస్తుందిలే అని చైనా తక్కువ అంచనా వేసింది. పేరుకు చిన్న దేశమైన చైనా కు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చింది ఆ దేశపు ఆర్మీ. తమ యుద్ధనౌకలతో  చైనా యుద్ధ నౌకలను ఆపి.. నౌకలో ఉన్న చైనా ఆర్మీ ని కేవలం లో దుస్తుల్లో  ఉంచి స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చి దీనిని వీడియో తీసి చైనాకు పంపింది ఆ దేశం. ఇది కాస్తా ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారిపోయింది.

మరింత సమాచారం తెలుసుకోండి: