హైదరాబాదులో అమాయకురాలైన వెటర్నరీ డాక్టర్ దిశ అత్యాచారం హత్య కేసు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఏకంగా నలుగురు మానవ మృగాలు దిశ అనే అమాయకురాలైన డాక్టర్ పై అత్యాచారం చేసి ఆపై సజీవ దహనం చేయడం అందరినీ ఒక్కసారిగా ఉలిక్కి పడేలా చేసింది. ఈ క్రమంలోనే ఈ కేసులో నలుగురు నిందితులను వెంటనే ఎన్కౌంటర్ చేసి చంపాలి అంటూ డిమాండ్లు తెరమీదకు వచ్చాయి. ఒకవేళ మీ వల్ల కాకపోతే చెప్పండి మాకు వదిలేయండి వాళ్ల ప్రాణాలు మేము తీస్తాం అంటూ ప్రజలు తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తం చేశారు. అంతేకాదు ఇక దిశా నిందితులను రిమాండ్లో ఉంచిన జైలు ముందు భారీగా నిరసనలు ఆందోళనలు కూడా చేపట్టారు.



 ఇలా దిశా కేసులో నిందితులను ఎన్కౌంటర్ చేయాలని లేదంటే వెంటనే ఉరి శిక్ష విధించాలి అంటూ దేశవ్యాప్తంగా నిరసనలు ఉవ్వెత్తున ఎగసిపడ్డాయి   ఈ క్రమంలోనే సైబరాబాద్ సీపీ గా ఉన్న సజ్జనర్ ఆధ్వర్యంలోని పోలీసు బృందం అత్యాచారం హత్య కేసులో నిందితులను ఎకౌంటర్ చేసింది. ఇక ఈ ఎన్ కౌంటర్  కాస్త సంచలనంగా మారి పోగా ఏకంగా అమాయకురాలి పై అత్యాచారం చేసిన నిందితులను ఎన్ కౌంటర్ చేయడంపై అందరూ హర్షం వ్యక్తం చేశారు. ఇలాంటి పోలీసులు ఉండాలి అంటూ పోలీసులపై ప్రశంసల వర్షం కురిపించారు. అయితే ఒకప్పుడు దిశ ఎన్ కౌంటర్ ఇక ఇప్పుడు పోలీసులకు ఎన్నో ఇబ్బందులను సృష్టిస్తుంది అని అర్థమైంది.


 ఇప్పటికే దిశా నిందితుల ఎన్ కౌంటర్ తో సంబంధమున్న అందరు పోలీస్ అధికారులు సిర్పూర్కర్ కమిటీ ఎదుట విచారణకు హాజరయ్యారు. ఈ క్రమంలోనే ఈ కమిటీ అటు పోలీస్ అధికారులను చిత్రవిచిత్రమైన ప్రశ్నలతో ఇబ్బందులకు గురి చేస్తోంది. ఈ క్రమంలోనే ఇటీవల షాద్ నగర్ ఏసిపి సురేందర్ రెడ్డి ని కూడా సిర్పూర్కర్ కమిటీ ముందు విచారణకు హాజరయ్యారు. ఈ క్రమంలోనే ఘటనా స్థలికి చేరుకున్నప్పుడు నిందితుల తమ కళ్ళల్లో మట్టి కొట్టి తమపై దాడి చేసేందుకు ప్రయత్నించారని అందుకే కాల్పులు జరిపి ఎన్కౌంటర్ చేయాల్సి వచ్చింది అంటూ సిర్పూర్కర్ కమిటీ ముందు వివరణ ఇచ్చారు. ఏ కంటి లో మట్టి కొట్టారు. అసలు అలా  మట్టి కొడుతున్న సమయంలో మీరు ఏం చేస్తున్నారు అంటూ కమిటీ చిత్రవిచిత్రమైన ప్రశ్నలు అడిగినట్లు తెలుస్తుంది  దిశ ఎన్ కౌంటర్  పోలీసులకు కాస్త ఇబ్బందిగానే మారిపోయింది అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. అయితే ఇలా నిందితులను ఎన్కౌంటర్ చేసిన పోలీసులు ఒకరకంగా మరోసారి ఎన్కౌంటర్ చేయకుండా భయపడుతున్నారని.. కానీ అటు అత్యాచారం చేసిన నిందితులను మాత్రం భయపెట్టే వారే లేకుండాపోయారు అంటూ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు విశ్లేషకులు.

మరింత సమాచారం తెలుసుకోండి: