ఇటీవలే తమిళనాడులోని ఊటీ దగ్గర ఆర్మీ హెలికాప్టర్ కుప్పకూలినా ఘటన దేశం మొత్తాన్ని ఒక్కసారిగా ఉలిక్కి పడేలా చేసింది.. 14 మంద తో ప్రయాణమైన ఈ హామీ హెలికాప్టర్ అకస్మాత్తుగా సాంకేతిక లోపం కారణంగా కుప్పకూలిపోయింది. దీంతో ఇక ఈ ప్రమాదంలో ఏకంగా 13 మంది ప్రాణాలు కోల్పోయినట్లు ఆర్మీ అధికారులు తెలిపారు. ఇప్పటివరకు పదకొండు మంది మృతదేహాలను వెలికి తీసినట్లు తెలిపారు. ఇందులో చీఫ్ ఆఫ్ డిఫెన్స్  బిపిన్ రావత్ తో పాటు ఆయన సతీమణి సహా పలువురు కమాండర్ స్థాయి అధికారులు కూడా ఉన్నారు. అదే సమయంలో తెలుగు రాష్ట్రానికి చెందిన జవాన్ సాయి తేజ కూడా ఈ ప్రమాదంలో మృతి చెందడం గమనార్హం.



 అయితే డీఎన్ఏ పరీక్షల ఆధారంగా మృతదేహాలను నిర్ధారిస్తున్నారు ఆర్మీ అధికారులు. అంతేకాదు ఈ ఘటనకు గల కారణాలు ఏంటి అన్న దానిపై కూడా ప్రస్తుతం విచారణ కొనసాగిస్తున్నారు. అయితే ఈ ఘటనలో చిత్తూరు జిల్లా జవాన్ సాయి తేజ కూడా మృతి చెందారు.  అయితే ఇక హెలికాప్టర్ ప్రమాదం జరగడానికి కొన్ని గంటల ముందే భార్య పిల్లలతో సాయి తేజ వీడియో కాల్ మాట్లాడినట్లు తెలుస్తోంది.  జవాన్ సాయి తేజ కు కుమారుడు మోక్షజ్ఞ కుమార్తె దర్శిని ఉన్నారు. ఇక వీడియో కాల్ మాట్లాడిన సమయంలో ఫ్యామిలీ ని ఎంతగానో మిస్ అవుతున్నాను అంటూ చెప్పాడట జవాన్ సాయి తేజ.


 ఈ క్రమంలోనే కూతురుని చూడాలని ఉంది అంటూ ఉదయం 8:15 గంటలకు భార్యతో ఎంతో సంతోషంగా వీడియో కాల్ మాట్లాడాడట సాయి తేజ. కానీ కొన్ని గంటల వ్యవధిలోనే హెలికాప్టర్ ప్రమాదంలో సాయితేజ మృతిచెందాడు. కాగా సాయి తేజ టాలెంట్ను గుర్తించి బిపిన్ రావత్ ఏకంగా తన పర్సనల్ సెక్యూరిటీ లో స్థానం కల్పించడం గమనార్హం. అయితే జవాన్ సాయి తేజ మృతిపై ప్రస్తుతం తెలుగు ప్రజలందరూ కూడా సంతాపం తెలియజేస్తున్నారు. ఇక భారత చీఫ్ ఆఫ్ డిఫెన్స్ బిపిన్ రావత్ మరణంపై దేశం మొత్తం దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: