ఇటీవలే ఆర్మీ హెలికాప్టర్ కుప్ప కూలిన ప్రమాదంలో చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాప్ బిపిన్ రావత్ మరణించడం దేశ ప్రజానీకాన్ని దిగ్భ్రాంతికి గురి చేసింది. ఆయన మరణాన్ని భారత్ జీర్ణించుకోలేక పోయింది అని చెప్పాలి. భారత ఆర్మీ లో ఎన్నో కీలక పదవులను అలంకరించి ఎన్నో ఏళ్ల నుంచి సేవలు చేసారు బిపిన్ రావత్. ఇక భారత దేశానికి మొట్టమొదటి త్రివిధ దళాధిపతి గా పదవీ బాధ్యతలు చేపట్టారు. ఇక ఎప్పుడూ ముక్కుసూటిగా మాట్లాడుతూ భారత రక్షణ విషయంలో ఎప్పుడూ కాంప్రమైజ్ కాకుండా ముందుకు సాగారు బిపిన్ రావత్. అలాంటి వ్యక్తిని భారత్ కోల్పోవడం అందరిని తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసింది.


 అయితే ఎన్నోసార్లు మరణానికి ఎదురెళ్లి మృత్యుంజయుడు గా తిరిగి వచ్చారు బిపిన్ రావత్. ఇలా భారత ఆర్మీలో మరణాన్ని ఎదిరించినా వీరుడిగా ఎంతగానో గుర్తింపు సంపాదించారు. అయితే ఇటీవల జరిగిన హెలికాప్టర్ ప్రమాదంలో బిపిన్ రావత్ తో పాటు ఆయన సతీమణి కూడా ఉండటం గమనార్హం. అంతేకాదు ఆర్మీకి చెందిన పలువురు కీలకమైన కమాండర్లు కూడా ఈ ప్రమాదంలో మరణించారు. ఇదిలా ఉంటే దాదాపు ఆరేళ్ల కిందట బిపిన్ రావత్ ఒక ప్రమాదం నుంచి బయటపడి మృత్యుంజయుడు గా మారిపోయాడు. కానీ ఇప్పుడు అలాంటి ప్రమాదంలో మరణించారు.


 2015 ఫిబ్రవరి మూడవ తేదీన లెఫ్టినెంట్ జనరల్ గా పనిచేస్తున్నారు బిపిన్ రావత్.. ఈక్రమంలోనే నాగాలాండ్ దిమాపూర్ జిల్లాలోని హెలిప్యాడ్ నుంచి హెలికాప్టర్లో బయలుదేరారు. అయితే చీతా హెలికాప్టర్ లో బయలుదేరిన సమయంలో ఆయనతో పాటు మరో ఇద్దరు సిబ్బంది మాత్రమే ఉన్నారు..  సరిగ్గా హెలికాప్టర్ టేకాఫ్ అయిన కొన్ని సెకన్ల సమయంలోనే హెలికాప్టర్లో సాంకేతిక లోపం తలెత్తింది. దీంతో హెలికాప్టర్ కొంత ఎత్తుకు వెళ్లగానే కుప్పకూలిపోయింది. ఈ ప్రమాదంలో  హెలిక్యాప్టర్ మొత్తం తునాతునకలు అయిపోయింది. అయితే ఈ ప్రమాదం నుంచి బిపిన్ రావత్ తో పాటు సిబ్బంది స్వల్ప గాయాలతో బయటపడ్డారు.. అప్పటి ప్రమాదంలో మృత్యుంజయుడు గా నిలిచిన బిపిన్ రావత్ ఇక ఇటీవల జరిగిన ప్రమాదంలో మాత్రం ప్రాణాలు కోల్పోయారు.

మరింత సమాచారం తెలుసుకోండి: