తెలంగాణలో పార్టీని బలోపేతం చేసేందుకు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అన్ని విధాలుగా కష్టపడుతూ పాదయాత్రకు శ్రీకారం చుట్టారు. పాదయాత్ర కు సంబంధించి బండి సంజయ్ అన్ని విధాలుగా కూడా కేంద్ర నాయకత్వం సలహాలు తీసుకుంటూ ముందుకు వెళ్తున్న సంగతి తెలిసిందే. బండి సంజయ్ గత కొన్ని రోజులుగా పాదయాత్ర కు సంబంధించి పార్టీ సీనియర్ నాయకులతో సమావేశాలు జరుపుతూ త్వరలోనే దీనికి సంబంధించి ఒక నిర్ణయం తీసుకునే అవకాశాలు ఉండవచ్చని అంటున్నారు.

పార్టీలో ఉన్న చాలామంది నాయకులు పాదయాత్ర విషయంలో భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారని మొదటి దశ పాదయాత్రలో చాలామంది నాయకులు సహకరించలేదని బిజెపి నాయకత్వం అంటుంది. ఎమ్మెల్సీ ఎన్నికలు ముగిసిన నేపథ్యంలో బండి సంజయ్ పాదయాత్ర కు సంబంధించి ఎటువంటి నిర్ణయం తీసుకోబోతున్నారు ఏంటనే దానిపై అందరూ కూడా ఆసక్తికరంగా ఎదురు చూస్తున్నారు. అయితే పాదయాత్ర వచ్చే ఏడాది మొదలుపెట్టే ఆలోచనలో బండి సంజయ్ ఉన్నారని పార్టీలో ఉన్న చాలా మంది సీనియర్ నాయకుల అభిప్రాయాలను ఆయన ముందుపెట్టారు అని రాజకీయ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.

ప్రధానంగా కిషన్ రెడ్డి వచ్చే ఏడాది ఫిబ్రవరి నుంచి పాదయాత్ర మొదలు పెట్టాలని బండి సంజయ్ కు సూచనలు సలహాలు ఇచ్చారని అయితే కేంద్ర నాయకత్వం మాత్రం బండి సంజయ్ పాదయాత్ర మరికొన్ని రోజులు వాయిదా వేసుకుంటే మంచిదని చెప్పినట్టుగా కూడా తెలుస్తోంది. అయితే బండి సంజయ్ ఇప్పుడు పాదయాత్ర ఎందుకు చేస్తున్నారు ఏంటి అనే దానిపై స్పష్టత లేకపోయినా వచ్చే ఏడాది తెలంగాణ అసెంబ్లీ రద్దు చేసే అవకాశం ఉందని అందుకే అడుగు వేస్తున్నారని అంటున్నారు. బండి సంజయ్ పాదయాత్ర కు సంబంధించి పార్టీలో ఉన్న కీలక నాయకులు కొంతమంది క్షేత్రస్థాయి వాస్తవాలను చెప్పే ప్రయత్నం చేస్తున్నారని అయితే కొన్ని పరిస్థితుల పార్టీకి అనుకూలంగా లేవు కాబట్టి కాస్త వాయిదా వేసుకుంటే మంచిదని చెప్పినట్టుగా కూడా తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: