కాంగ్రెస్ అగ్ర నేత ఆంధ్రప్రదేశ్ పర్యటనకు వచ్చే అవకాశాలు ఉన్నాయనే ప్రచారం ఈ మధ్య కాలంలో కాస్త ఎక్కువగా జరుగుతోంది. రాహుల్ గాంధీ ఆంధ్రప్రదేశ్ పర్యటనకు రావడమే కాకుండా అమరావతి ఉద్యమానికి మద్దతు పలికే అవకాశాలు ఉన్నాయి అనే వార్తలు వచ్చాయి. అయితే మూడు రాజధానులు కు సంబంధించి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో రాహుల్ గాంధీ అమరావతి ఉద్యమం గురించి పెద్దగా మాట్లాడే అవకాశం లేదని అయితే రాయల సీమలో ఒక బహిరంగ సభలో కాంగ్రెస్ పార్టీ ఏర్పాటు చేసే అవకాశం ఉండవచ్చని వార్తలు వినపడుతున్నాయి.

రాజకీయంగా కాస్త భిన్నమైన పరిస్థితులు ఆంధ్రప్రదేశ్లో ఉన్న నేపథ్యంలో ఆయన ఈ నిర్ణయం తీసుకోబోతున్నారు ఏంటి అనేది ఉత్కంఠ రేపుతోంది. బద్వేల్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి కాస్త మంచి ఓట్లు వచ్చిన నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్లో ఓటు బ్యాంకు అలాగే ఉంది అనే భావనలో రాహుల్ గాంధీ ఉన్నారని దాన్ని పూర్తిస్థాయిలో బలోపేతం చేసే విధంగా ఆయన ప్రయత్నాలు చేస్తున్నారని సోనియాగాంధీ సూచనలు సలహాల మేరకు రాష్ట్ర నాయకత్వాన్ని  కూడా పూర్తిగా మానేస్తే ఖచ్చితంగా మంచి ఫలితం ఉంటుంది అనే భావన లో ఆయన ఉన్నారని అంటున్నారు.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షుడిగా మాజీ ముఖ్యమంత్రి కిరణ్కుమార్రెడ్డికి బాధ్యతలు అప్పగించి ఆయన ద్వారా రాష్ట్రంలో యాత్ర చేయించి ఆలోచనలో ఉన్నారని దీనికి సంబంధించి త్వరలోనే ఒక నిర్ణయం తీసుకోవచ్చని అంటున్నారు. కాంగ్రెస్ పార్టీలో ఉన్న కొంతమంది కీలక నేతలు ఈ మధ్య కాలంలో రాష్ట్రంలో కాస్త తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా మాట్లాడుతున్న నేపథ్యంలో వచ్చే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీతో కలిసి రాష్ట్రంలో ముందుకు వెళ్లే ఆలోచన కూడా చేస్తున్నారని అంటున్నారు. ఏది ఎలా ఉన్నా సరే ప్రస్తుతం ఆ పరిస్థితులు మాత్రం కాస్త కాంగ్రెస్ పార్టీకి ఆంధ్ర ప్రదేశ్ లో అనుకూలంగా కనబడుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: