ప్రపంచ పటంలో ఒక తీవ్రవాద దేశం ఏర్పాటు చేయడం బహుశా చైనా, రష్యా, పాక్ లకు కొత్తగా అనిపించి ఉండొచ్చు. అది వాళ్లకు కూడా ఒకనాడు శాపంగా మారుతుందని అప్పట్లో ఊహించి ఉండరు. పాముకు పలు పోసినంత మాత్రాన కాటువేయదు అనుకుంటే అమాయకత్వం అనిపించుకుంటుంది, వీళ్లు చేసింది కూడా అదే. పాక్ భారత్ పై కోపంతో తీవ్రవాదులకు స్థావరాలు ఏర్పాటు చేసుకునే అవకాశం ఇచ్చింది. దాని పరిస్థితి చూస్తూనే ఉన్నాం. అలాగే పాక్ తో స్నేహం అంటున్న చైనా పరిస్థితి కూడా అంతకంటే బెటర్ గా ఏమి లేదు. పాక్ లో రెండు దశాబ్దాలు దాక్కున్న తాలిబన్ లు చైనా వ్యవహారం కూడా తెలుసుకున్నారు. అందుకే దానికే తెలియకుండా ఆ దేశంలో కూడా స్థావరాలు ఏర్పాటు చేసుకున్నారు. ఆఫ్ఘన్ ఆక్రమణ జరిగిన తరువాత దానిలో ఒక్క తాలిబన్ లు కాదు, పూర్తిగా తీవ్రవాద సంస్థలన్నీ కూడా పండగ చేసుకున్నాయి.

ప్రపంచ తీవ్రవాద సంస్థలకు ఇప్పుడు ఆఫ్ఘన్ స్థావరంగా మారిపోయిన విషయం ఐక్యరాజ్యసమితి కూడా వెల్లడించేసింది. అయినా అక్కడ శాంతి లేదు కారణం అదే ఉంటె ప్రజలు తమలో చేరడానికి సిద్ధంగా ఉండరు. వాళ్ళను ఉగ్రవాదం వైపుకు మరల్చాలి అంటే, అక్కడ సాంకేతికత కనిపించకూడదు, విద్య వంటివి అసలు ఉండకూడదు, అనాగరిక సమయంలో ఉండే నియమాలు అమలు చేయాలి. పేదరికం తాండవం చేస్తూనే ఉండాలి. అప్పుడే గుప్పెడు కూటికోసమైనా అక్కడ వారు తాము చెప్పిన పనులను చేస్తారు అని వారి భావన. అదే ప్రపంచంలో పేదల యందు కూడా వాళ్ళు ప్రయోగిస్తున్న అస్త్రం. అందుకే వాళ్లకు ఎక్కడబడితే అక్కడ స్లీపర్ సెల్స్ ఉన్నారు.

రాబోయే రోజులలో పాక్ ను కూడా ఆక్రమించే యోచనలో ఉన్నాయి తాలిబన్ వర్గాలు. అంటే మరో దేశం ఉగ్ర దేశం కావడానికి సిద్ధంగా ఉందన్నది వాస్తవం. ఒకటి ఉంటేనే ఆగటం లేదు. మరొకటి తయారైతే ఆగుతారా. ఒక్కటి ఉగ్రదేశం అవగానే ప్రపంచం ఎన్నడూ లేని విధంగా రక్షణ వ్యవస్థను హుషారు చేసింది. ఎప్పుడు ఎక్కడ ఏమి జరుగుతుంది అనే భయం తో కాలం వెళ్లబుచ్చుతుంది. ఇక మరో దేశం కూడా అంటే, ఆ పరిస్థితి ఊహించనలవి. ఆల్ ఖైదా రకం కూడా ఉగ్ర సంస్థ, ఇది కూడా ఆఫ్ఘన్ లో స్థావరాలు లేదా క్యాంపులు ఏర్పాటు చేసుకొని మరింతగా వేళ్ళు పాతుకుపోయేట్టుగా తన సైన్యాన్ని పెంచుకుంటున్నట్టు అమెరికా నిఘా వ్యవస్థ స్పష్టం చేసింది. వస్తున్నవి గడ్డురోజులే, భయం కాదు, బాధ్యత పెరగాలి. చుట్టుపక్కల అనుమానంగా ఉన్న వారిని గమనిస్తూ, ఎవరి జీవితం వాళ్ళు గడుపుతూ ఉండాలి. అలాంటివి ఏమైనా కనిపిస్తే, వెంటనే అధికారులకు సమాచారం ఇవ్వడం లాంటివి అలవాటు చేసుకోవాల్సి ఉంటుంది. జర భద్రం!!

మరింత సమాచారం తెలుసుకోండి: