భారత్ పాకిస్తాన్ సరిహద్దుల్లో ఉండే ఉద్రిక్త పరిస్థితుల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. దశాబ్దాలు గడిచిపోతున్నాయి కానీ అటు భారత్ పాకిస్తాన్ సరిహద్దుల మధ్య ఉన్న ఉద్రిక్త పరిస్థితులు మాత్రం సాధ్యం తగ్గడం లేదు. ముఖ్యంగా పాకిస్తాన్ నుంచి ఎంతోమంది ముష్కరులు భారత్ లోకి అక్రమంగా చొరబడటానికి ఎప్పుడు ప్రయత్నాలు చేస్తూనే ఉంటారు అని చెప్పాలి. ఈ క్రమంలోనే ఇక అటు భారత భద్రత బలగాలు కూడా ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉంటూ పాకిస్తాన్ ముష్కరులను మట్టు పెడుతూ ఉంటాయి. ఇక ఇతివలి కాలంలో అయితే 370 ఆర్టికల్ రద్దు తర్వాత భారత బలగాలు మరింత అప్రమత్తంగా ఉంటున్నాయి.


 ఇలాంటి సమయంలోనే ఇక భారత భూభాగంలో ఉన్న జమ్మూ కాశ్మీర్ లోకి అక్రమంగా అడుగు పెట్టేందుకు ప్రయత్నిస్తున్న ఉగ్రవాదుల వెన్నులో వణుకు పుట్టే విధంగా భారత ఆర్మీ ఎన్కౌంటర్లు చేస్తూ ఉంది అన్న విషయం తెలిసిందే. అధునాతన  టెక్నాలజీని ఉపయోగించి అటు ముష్కరులు ఏర్పరచుకున్న స్థావరాలను గుర్తించి వివిధ రకాల ఆపరేషన్స్ నిర్వహించి ఉగ్రవాదులను మట్టు పెడుతుంది అన్న విషయం తెలిసిందే. ఇక ఇటీవల జమ్మూ కాశ్మీర్ లో మరోసారి ఎన్కౌంటర్ జరిగింది. ఇద్దరు ముష్కరులని భద్రత బలగాలు మట్టుపెట్టాయి.


 ఇలా ఎన్కౌంటర్లో మృతి చెందిన వారు అటు లష్కరే తోయబా సంస్థకు చెందిన ఉగ్రవాదులు అన్న విషయాన్ని అధికారులు గుర్తించారు. అయితే ఇక ఇద్దరు ఉగ్రవాదులను ఎన్కౌంటర్ చేయడంలో శునకం కీలక పాత్ర పోషించిందట. అనంతనాగ్ జిల్లాలోని టంగ్ పావా ప్రాంతంలో ఘటన చోటు చేసుకుంది. అయితే ఉగ్రవాదులు నక్కి ఉన్నారని సమాచారం అందుకున్న భద్రత బలగాలు ఆ ప్రాంతంలో గాలింపు చర్యలు చేపట్టారు. ఈ క్రమంలోనే భద్రత బలగాలతో ఉన్న ప్రత్యేక శిక్షణ పొందిన శునకం ఉగ్రవాదులపై దాడి చేసింది. ఈ క్రమంలోనే తుపాకీతో శునకంపై కాల్పులు జరిపారు. దీంతో అప్రమత్తమమైన భారత బలగాలు ముష్కరులను మట్టుపెట్టారు. ఇక ఈ ఆపరేషన్ లో శనకం తీవ్రంగా  గాయపడగా.. ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నట్లు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

Vir