తాజాగా సబ్బం హరి ఓ భూఆక్రమణ ఆరోపణలు పొందుతున్న సంగతి తెలిసిందే.. ఆయన మునిసిపాలిటీ స్థలాన్ని ఆక్రమించి ఇల్లు కట్టుకున్నారు. ఇది జరిగి కూడా పాతికేళ్ళు దాటుతోంది. ఇపుడు హఠాత్తుగా గుర్తుకొచ్చినట్లుగా జీవీఎంసీ అధికారులు ఒక్క పోటుతో దానిని కూల్చేశారు. దీని మీద సబ్బం హరి మాట్లాడుతూ తనకు నోటీసులు ఇవ్వకుండా ఎలా కూల్చుతారు అంటూ మండిపడ్డారు. అయితే ఇది మునిసిపాలిటీకి చెందిన స్థలం అని పన్నెండు అడుగులు ఆక్రమించి మరీ ముందుకు సబ్బం హరి అక్రమ నిర్మాణాలు చేశారని అధికారులు అంటున్నారు. ఏదేమైనా ఇందులో కక్ష్యపూరిత చర్య కనిపిస్తుందని అందరికి తెలుస్తుంది..