రాజకీయాల్లో సరైన బ్యాక్ బోన్ లేకపోతే ఎదగడం చాలా కష్టం.. పార్టీ కోసం ఎంత కష్టపడినా బ్యాక్ అప్ లేకపోతే ఆ నాయకుడు పెద్ద నాయకుడు అయ్యే ఛాన్స్ ఏమాత్రం ఉండదు.. లీడర్ గా ఎదగాలంటే అప్పటికే పెద్ద పెద్ద లీడర్లుగా ఉన్నవారితో అనుబంధం పెంచుకోవాలి.. వారితో కలుగొలుపుగా ఉండాలి.. అయితే ఇవన్నీ చేస్తున్నా కూడా విజయనగరం నియోజకవర్గంలో ఓ నేత కు వ్యతిరేక పనులు జరుగుతున్నాయి.. విజయనగరంలో పెన్మత్స సాంబశివరాజు కుటుంబం ఆదినుంచి వైసీపీ కి వెన్నుదన్నుగా ఉంటుంది. ఇక్కడ వైసీపీ జెండాను మోసిన మొట్టమొదటి వ్యక్తి కూడా ఈకుటుంబం లోనుంచి వ్యక్తి అయిన సాంబశివరాజు అని చెప్పాలి..