ప్రస్తుతం పవన్ కళ్యాణ్ మొత్తం ఫోకస్ అయన అనౌన్స్ చేసిన నాలుగు సినిమాలపై నే ఉంది.. పూర్తి స్థాయి రాజకీయాల్లో కి వచ్చానన్న పవన్ కళ్యాణ్ పార్ట్ టైం రాజకీయాలు చేస్తూ ఫుల్ టైం సినిమాల్లోనే ఉంటున్నారు..కరోనా తర్వాత పవన్ కళ్యాణ్ తిరిగి తన సినిమా షూటింగ్ లు ప్రారంభించి అందులో బిజీ గా ఉన్నారు.. 2014 లోనే పార్టీ పెట్టినా పవన్ కళ్యాణ్ కు ఆ టైం లో ఎన్నికల్లో పాల్గొనే అవకాశం రాలేదు.. దాంతో చంద్రబాబు కు మద్దతు ఇచ్చి టీడీపీ గెలుపులో కీలక పాత్ర వహించారు.. ఇక 2019 లో అవకాశం వచ్చిన సరైన బలం లేక కేవలం ఒక్క సీటుతో సరిపెట్టుకున్నాడు.. దాంతో పవన్ జనసేన కథ మళ్ళీ మొదటికొచ్చింది.. దాంతో ఏం చేయాలో అర్థం కాక మళ్ళీ సినిమాల్లోకి వెళ్ళిపోయాడు పవన్ కళ్యాణ్..