దుబ్బాక లో ఫలితం టీఆరెస్ కి వ్యతిరేకంగా వచ్చింది. దాంతో టీ ఆర్ ఎస్ శిబిరాలు నిరుత్సాహపడ్డాయి.. ఇక్కడ బీజేపీ తరపున పోటీ చేసిన రఘునందన్ రెడ్డి మంచి మెజారిటీ తో గెలిచి టీఆరెస్ ని కంగు తినిపించాడు.. సోలిపేట సుజాత ఓడిపోవడంతో దుబ్బాక లో టీ ఆర్ ఎస్ పార్టీ కొంత నిరుత్సాహం పొందగా నిరుత్సాహపడొద్దని తెరాస పార్టీ అధ్యక్షుడు కేటీఆర్ ఓదార్చే ప్రయత్నం చేశారు. ఉత్కంఠ భరితంగా సాగిన దుబ్బాక ఉప ఎన్నికల్లో ఓటమి తరువాత టీఆరెస్ మంత్రి కేటీఆర్ మీడియా సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 2014 లో తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించినప్పటి నుంచి జరిగిన ప్రతి ఎన్నికల్లో తమ పార్టీ విజయ కేతనం ఎగురవేసిందని అన్నారు..