మాస్ మహారాజా రవితేజ ప్రస్తుతం క్రాక్ సినిమా ని రిలీజ్ రెడీ గా ఉంచాడు..రవితేజ తో డాన్ శీను, బలుపు వంటి సినిమాలను చేసిన గోపీచంద్ మలినేని తో ఈ సినిమా కి దర్శకుడు.. పోలీస్ పాత్రలకు పెట్టింది పేరుగా ఉన్న రవితేజ మళ్ళీ ఈ సినిమా ద్వారా మళ్ళీ పోలీస్ అవతారం ఎత్తారు. వీరి కాంబినేషన్ లో వస్తున్న మూడో సినిమా గా క్రాక్ శేరవేగంగా షూటింగ్ జరుపుకుంది. ఈ సినిమాను సమ్మర్ లోనే విడుదల చేయాలనుకుంటే కరోనా కారణంగా వాయిదా పడింది. దాంతో ధియేటర్ల ఓపెనింగ్ కోసం ఇప్పటివరకు వేచి చూస్తూనే ఉన్నారు.