దుబ్బాక లో బీజేపీ విజయం టీ ఆర్ ఎస్ పార్టీ వెన్నులో ఒణుకు పుట్టించిందని చెప్పొచ్చు.. ఎందుకంటే చేతిలో ఉన్న నియోజకవర్గం ఇప్పుడు ఇలా బీజేపీ పాలుకావడంతో ఎక్కడ తప్పు జరిగిందో పునరాలోచించుకుంటున్నారు. అభ్యర్థి ఎంపిక విషయంలో కేసీఆర్ తప్పు చేశారని పార్టీ నేతలనుంచి వస్తున్న మాట..హరీష్ రావు లాంటి లీడర్ అక్కడ ప్రచారం చేసినా పార్టీ గెలవలేదంటే కేసీఆర్ పై , టీ ఆర్ ఎస్ పార్టీ పై ఎంతటి వ్యతిరేకత ఉందొ అర్థం చేసుకోవచ్చు.. ఈ ఓటమి ప్రభావం పార్టీ పై చాలా ఉంటుందని చెప్పొచ్చు.. ఎందుకంటే భవిష్యత్ లో గ్రేటర్ ఎన్నికలు, ఎమ్మెల్సీ ఎన్నికలు ఉన్నాయి. ఇప్పటికే వ్యతిరేకత ఉన్న టీ ఆర్ ఎస్ కు దుబ్బాక ఫలితం కాస్త ఆ ఎన్నికల్లో ప్రతికూలత చూపించే అవకాశం ఉందని చెప్పొచ్చు.