దుబ్బాక లో బీజేపీ గెలిచి సంచలనం సృష్టించింది అని చెప్పొచ్చు.. అధికారంలో ఎంతో బలమైన టీ ఆర్ ఎస్ పార్టీ ఉండగా, హరీష్ రావు లాంటి మహానేత ప్రచారం చేసినా కూడా బీజేపీ గెలిచిందంటే ప్రజలు ఏ స్థాయిలో టీ ఆర్ ఎస్ పై వ్యతిరేకంగా ఉన్నారో అర్థం చేసుకోవచ్చు.. చాలా రోజులనుంచి ప్రభుత్వం తీరుపై ప్రజలు కొంత ఆగ్రహతో ఉన్నారు.కేసీఆర్ మొదటి సారి అధికారంలోకి వచినప్పటిలా ఇప్పుడు మనస్తత్వం లేదని కొందరు అంటుంటే ఆయనది నియంతృత్వ పాలన అని ప్రజల్లో అభిప్రాయాలూ వస్తున్నాయి.. అంతేకాకుండా హామీల అమలు విషయంలో పారదర్శకత, వేంగవంతం లేకపోవడంతో కేసీఆర్ కి చిన్న ఝలక్ ఇచ్చారు దుబ్బాక ప్రజలు..