రాష్ట్రంలో పార్టీ ల మధ్య పోటీ ఎలా ఉన్నా ప్రజల స్టాటజీ లు చివరి నిమిషం వరకు ఎవరికీ అర్థం కావు.. అందుకు ఉదాహరణగా టీడీపీ నే చెప్పొచ్చు. ఎందుకంటే అధికారంలోఉన్న పార్టీ ఈ రేంజ్ లో ఓడిపోతుందని వైసీపీ కూడా కలలో ఊహించి ఉండదు. అప్ప్పటివరకు టీడీపీ కి గెలుపు గాలులు జోరుగా వీచాయి.. ఎన్నికలు ముగిసాక కూడా చంద్రబాబు టీడీపీ దే విజయం అని విర్రవీగారు కానీ ప్రజల తీర్పు దానికివ్యతిరేకంగా వచ్చింది.. దాంతో వైసీపీ అధికారంలోకి రప్పించి టీడీపీ ని ప్రతిపక్షంలో కూర్చునేలా చేశారు ప్రజలు.. ఇక జగన్ పాలన కూడా అపహాస్యం చేస్తూ చంద్రబాబు కవ్వింపు చర్యలకు పాల్పడుతున్నారు.