దేశంలో కాంగ్రెస్ పని అయిపోయినట్లే చెప్పుకోవాలి ఎందుకంటే కేంద్రంలో బీజేపీ పార్టీ కాంగ్రెస్ ని ఏ కోశానా గెలవనివ్వట్లేదు. దానికి తోడు కాంగ్రెస్ పరిస్థితి కూడా అంతంతమాత్రంగానే ఉంది.. రాహుల్ గాంధీకి నాయకత్వ లేమి ఉండడంతో పార్టీ ఈ పరిస్థితి కి వచ్చిందని చెప్పొచ్చు. అంతేకాదు అంతర్గత విభేదాలు కూడా ఉండడంతో పరిస్థితి దారుణంగా మారిపోయింది.కేంద్రంలో అలా ఉంటే రాష్ట్రాల్లో ప్రాంతీయ పార్టీ లు కాంగ్రెస్ ని తొక్కి పడేస్తున్నాయి. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో కాంగ్రెస్ పరిస్థితి హీనంగా తయారైంది..