మొన్నటిదాకా మోడీ చేతిలో జగన్ కీలు బొమ్మ అయిపోయాడని టీడీపీ ఆరోపించింది. దాంతో ప్రజలు కూడా జగన్ ప్రస్తుత చేస్తున్న పనులని బట్టి నిజమే అనుకున్నారు.. మోడీ పిలిచినప్పుడల్లా జగన్ పరిగెత్తుకుంటూ వెళ్లడం, అవసరం ఉన్నా లేకుండా ఢిల్లీ పెద్దలతో ముచ్చటించడం వంటివి చూసి ప్రజలు కూడా జగన్ ఏంటి మోడీ భజన చేస్తున్నారని అనుకున్నారు. కానీ జగన్ అలా చేయడానికి కారణం లేకపోలేదు. రాష్ట్రానికి చేయించుకోవాల్సిన పనులను చేయించుకోవడానికి జగన్ మోడీ చుట్టూ తిరుగుతున్నది తప్పా జగన్ కి అలాంటిదేమీ లేదని తేలిపోయింది.. పోనీ ఇంత తిరుగుతున్న మోడీ రాష్ట్రానికి సాయం చేశాడా అంటే ఉన్న నిధుల్ని కొల్లగొట్టి జగన్ ని పెద్ద జోకర్ చేశాడు.. కేంద్రంలోని మోడీ సర్కార్ కి అన్ని విధాలుగా మద్దతు ఇస్తున్నా కూడా ఏ మాత్రం ఖాతరు లేకుండా కేంద్ర పెద్దలు వ్యవహరిస్తున్నారు.