దుబ్బాక లో బీజేపీ విజయం చాలా ప్రశ్నలకు సమాధానం దొరికినట్లు అయ్యింది.. తెలంగాణ లోప్రధాన ప్రతిపక్షంగా కాంగ్రెస్ లో పస లేని వేళా, అధికార పార్టీ కి ఎదురెళ్లి నిలిచే పార్టీ లేని వేళా, ప్రజలు టీ ఆర్ ఎస్ కి కాకుండా ఎవరికీ ఓటు వేయాలి అని సందిగ్ధం నెల కొన్న వేళా బీజేపీ పార్టీ వీటన్నికి సమాధానం గా నిలిచింది.. మొన్నటి ఎన్నికల్లోకూడా బీజేపీ ఏమాత్రం కౌంటర్ ఇవ్వలేకపోయింది. కాంగ్రెస్ పరిస్థితి అయితే మరీ దారుణంగా తయారైంది. ఎంపీ ఎలక్షన్స్ లో బీజేపీ నాలుగు సీట్లు గెలవడంతో ప్రజల్లో కొత్త పార్టీ పై నమ్మకాలూ పెట్టుకున్నారు. దేనికి తోడు కేసీఆర్ పై వ్యతిరేకత కూడా బీజేపీ గెలుపుకి కారణమయ్యింది.