ఏపీలో తిరుపతి ఉప ఎన్నికకు రంగం సిద్ధమవుతుంది. ఎన్నికల కమిషన్ ఇక్కడ ఉప ఎన్నిక నిర్వహించడానికి అన్ని సిద్ధం చేస్తుంది. ముహూర్తం పెట్టడమే ఉంది.. అయితే అప్పుడే ఎన్నికలు దగ్గరికొచ్చేసినట్లు ఇక్కడి ప్రతిపక్షాల ప్రవర్తన చూస్తే తెలుస్తుంది. టీడీపీ అయితే ఎక్కడ తమ ఉనికి కోల్పోతుందో అని వైసీపీ ఓడించాడనికి బీజేపీ తో చేతులు కలపడానికి సైతం సిద్ధంగా ఉంది.. ఇటీవలే జరిగిన అసెంబ్లీ ఎన్నికల సమయంలో మోడీ కి, టీడీపీ కి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితి నెలకొంది.. ప్రత్యేక హోదా విషయంలో చంద్రబాబు చేసిన పోరాటానికి మోడీ దిగి రావాల్సి వచ్చింది. అయితే ఆ పోరాటం వల్ల చంద్రబాబు పై కొంత సింపతీ కూడా వచ్చింది..