దుబ్బాక లో అలా గెలిచెందో లేదో బీజేపీ కి తెలుగు రాష్ట్రాల్లో అధికారంలోకి వచ్చేసినంత ఆనందం వేస్తుంది.. ఒక్క సీటు కే వీరు ఇలా చేస్తుంటే ప్రజలు చోద్యం చూస్తున్నట్లు చూస్తున్నాను. తెలంగాణ లో అంటే బీజేపీ సంబరాలు చేసుకుంటుంది అంటే పర్వాలేదు కానీ ఏపీ లో ఎం చేసిందని బీజేపీ సంబరాలు చేసుకుంటుందో అర్థం కావట్లేదు..తెలంగాణ లోరెండు అసెంబ్లీ సీట్లు, నాలుగు పార్లమెంట్ సీట్లు గెలిచి ఇప్పుడిప్పుడే బలపడుతుందో.. ఏపీ లో కనీసం ఎమ్మెల్యే కూడా లేని బీజేపీ కి తామేదో గెలిచేశామని వ్యవహరించడం ఇప్పుడు వింతగా ఉంది.. అంతేకాదు తిరుపతిలో త్వరలో జరగబోయే ఉప ఎన్నికలో తమదే విజయం అని చెప్పుకుంటుంది.