దుబ్బాక లో ఫలితం టీఆరెస్ కి వ్యతిరేకంగా వచ్చింది. దాంతో టీ ఆర్ ఎస్ శిబిరాలు నిరుత్సాహపడ్డాయి.. ఇక్కడ బీజేపీ తరపున పోటీ చేసిన రఘునందన్ రెడ్డి మంచి మెజారిటీ తో గెలిచి టీఆరెస్ ని కంగు తినిపించాడు.. సోలిపేట సుజాత ఓడిపోవడంతో దుబ్బాక లో టీ ఆర్ ఎస్ పార్టీ కొంత నిరుత్సాహం పొందినారు. నిరుత్సాహపడొద్దని తెరాస పార్టీ అధ్యక్షుడు కేటీఆర్ ఓదార్చే ప్రయత్నం చేశారు. రఘునందన్ ముచ్చటగా మూడోసారి అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి ఉప ఎన్నికలో బరిలో దిగి విజయం సాధించారు. ఈ సారైనా తనకు ఓట్లు వేసి గెలిపించండి.. అంటూ విన్నవించి ప్రజల ఓట్లు పొందారు. లక్ష్యం సాధించారు. తొలుత 2014 , 2019 ఎన్నికల్లో పోటీ చేసినా గెలవలేకపోయారు.. ఇప్పుడు ఉప ఎన్నికల్లో గెలిచి తన సత్తా చాటారు.