కేసీఆర్ ఏది చేసినా సంచలనమే.. తెలంగాణ తీసుకువచ్చే దగ్గరినుంచి నిన్నటి రెవెన్యూ చట్టంలో మార్పుల వరకు అన్ని కేసీఆర్ నిర్ణయాలు చరిత్ర ని తిరగరాసినవే అని చెప్పుకోవాలి..మొదటి సారి ఎన్నికల్లోకి వచ్చిన తర్వాత కేసీఆర్ ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా రైతు బంధు ను ప్రవేశపెట్టి ఐక్యరాజ్య సమితి పొగడ్తను సైతం సంపాదించుకుని చరిత్ర సృష్టించారు.. రైతులకు 24 గంటల ఉచిత విద్యుత్ దేశంలో ఎవరు ఇవ్వలేదు, రైతు భీమా ఎక్కడా ప్రవేశపెట్టలేదు, ఇంటింటా నల్లా నీరు ఎప్పుడు జరగలేదు ఇలా చెప్పుకుంటే పోతే కేసీఆర్ ప్రజలకు సంక్షేమ పథకాలు సరికొత్తవి ప్రవేశపెట్టి మళ్ళీ ముఖ్యమంత్రి గా గెలిచారు..