టీడీపీ లో ఉన్నా చాలామంది నేతలు ఇప్పుడు పార్టీ కార్యకలాపాల్లో పెద్ద గా కనిపించడం లేదు.. అందుకు కారణం పార్టీ అధికారంలో లేకపోవడమే.. అయితే టీడీపీ లో పెద్ద పెద్ద స్థాయిలో ఉన్న నేతలు కూడా చంద్రబాబు కు సహాయంగా ఉండకపోవడం ఇప్పుడు అంతటా చర్చనీయాంశమైంది.. అసలే పార్టీ ఓడిపోయి కష్టాల్లో ఉంటే చంద్రబాబు ఒక్కడే పార్టీ బాధ్యత ను నెత్తిన వేసుకుని పరుగులు పెడుతున్నారు.. అన్ని నియోజకవర్గాల్లో పార్టీ ని బలోపేతం చేయాలనీ తెగ కష్టపడుతున్నారు.. ఇలాంటి టైం లో ఆయనకీ తోడుగా ఉండాల్సిన నాయకులూ ఎందుకో బయటకు రావట్లేదు. పార్టీ కోసం పనిచేయట్లేదు.. అయితే వీరు బయటకి రాకపోవడానికి కారణం లేకపోలేదట.. అందుకు కారణం చంద్రబాబు పై అసంతృప్తి అని చెప్పొచ్చు.