తెలుగుదేశం పార్టీ లో ఒకప్పుడు కీలక పాత్ర వహించి ప్రస్తుతం బీజేపీ పార్టీ లో కొనసాగుతున్న రాజకీయ నాయకుడు సుజనా చౌదరి. మొదటి నుంచి అయన రాజకీయాలు ఎలా ఉంటాయి అంటే కొంత ఆధిపత్య ధోరణి కనిపిస్తుంది.. చంద్రబాబు దగ్గర శిష్యరికం చేసి వచ్చిన సుజనా కాస్త అటు ఇటుగా చంద్రబాబు ఆలోచించే ధోరణినే, అవలంభించే పద్ధతినే అవలంభిస్తుంటారు. ఇటీవలే బీజేపీ లోకి వెళ్లిన సుజనా అక్కడ కూడా పార్టీ లో అలాంటి రాజకీయం చేసి పార్టీ లో పాతుకుపోవాలని చూస్తున్నారు. వాస్తవానికి రాష్ట్ర బీజేపీ పేరున్న లీడర్ ఎవరు లేరు.. ఇప్పుడు పవన్ కళ్యాణ్ చేరిక తో పవన్ రూపంలో ఓ పేరున్న నాయకుడు బీజేపీ కి దొరికినా ఆయన తరువాత ఏ నాయకుడు ప్రజల్లో అంతగా చొచ్చుకుపోలేదు..