రాజకీయాల్లో ఓ నిర్ణయం అందరి భవిష్యత్ మార్చేస్తుంది. ఓ నాయకుడి నిర్ణయం పార్టీ భవిష్యత్ ని, పార్టీ ని నమ్ముకున్న నాయకుల ఫ్యూచర్ ని మార్చేస్తుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు. టీడీపీ విషయంలో ఈ మధ్య చంద్రబాబు నిర్ణయాలు ఏమాత్రం పార్టీ కి ఉపయోగపడడం లేదు.. పార్టీ ఓడిపోయినా దగ్గరినుంచి చంద్రబాబు నిర్ణయాలు తీసుకున్నవి అన్ని పార్టీ కి వ్యతిరేకంగానే అవుతున్నాయి.. కాగా అవి అధికార పార్టీ కి అనుకూలంగా మారి టీడీపీ పరిస్థితి ని చేజేతులా దిగజారేలా చేస్తున్నాయి.. మధ్యలో ఓ బీజేపీ కూడా టీడీపీ కి కొంత తలనొప్పిగా మారిపోయింది. చీటికీ మాటికీ వైసీపీ ని కాదని టీడీపీ ని విమర్శిస్తూ బలపడేందుకు ట్రై చేస్తుంది..