గ్రేటర్ ఎన్నికలు దగ్గరికొస్తున్న కొద్దీ హైదరాబాద్ లో రాజకీయాలు ఆసక్తి కరంగా మారుతున్నాయి.. అధికార , ప్రతిపక్ష పార్టీ లు ఒకరిమీద ఒకరు విమర్శలు చేసుకుంటున్నారు.. ప్రధానంగా అధికార తెలంగాణ రాష్ట్ర సమితి ఒకడుగు ముందుకేసి ప్రచారానికి తెరలేపింది.. ఈ ఎన్నికకు ఇన్ ఛార్జిగా కేటీఆర్ ను పార్టీ అధిష్టానం నియమించి అక్కడ 100 స్థానాలపై కన్నేసింది. ప్రతిపక్షాలు సైతం ఈ ఎన్నికలో విజయం సాధించేందుకు తమ అస్త్రాలను ఉపయోగిస్తుంది. బీజేపీ అయితే ఒకడుగు ముందుకేసి పవన్ కళ్యాణ్ ని రంగంలోకి దించే ఆలోచన చేస్తుంది. ఇటీవలి కాలంలో జనసేన పార్టీ కన్నా.. బీజేపీ గురించే ఎక్కువ ట్వీట్లు.. ప్రకటనలు చేస్తున్న ఆయనను గరిష్టంగా ఉపయోగించుకోవాలని బీజేపీ నేతలు ఆలోచిస్తున్నారు. అందుకే తెలంగాణ బీజేపీ నేతలు ఆయన్ని గ్రేటర్లో ప్రచారానికి వినియోగించుకోనున్నారు..