తెలుగు రాష్ట్రాలపై కేంద్రం ప్రభుత్వం చూపుతున్న వివక్ష పై పెద్దఎత్తున చర్చలు సాగుతున్నాయి. తెలుగు రాష్ట్రాలకి వచ్చే వాటాలలో అన్యాయం జరగడమే కాకుండా ఇస్తామన్న హామీ లు ఇవ్వకపోవడంతో ఇక్కడిప్రజలు కేంద్ర వైఖరి పై కొంత ఆగ్రహంగా ఉన్నారు.. తెలంగాణ లో ఇప్పటికే కేసీఆర్ నాయకత్వాన చిన్న పాటి ఉద్యమం మొదలయింది.. ఏపీ లో కూడా మొదలయ్యే అవకాశాలు ఉన్నాయి.. కేసీఆర్ మోడీ ప్రభుత్వం ఇవ్వాల్సిన జీఎస్టీ బిల్లులను ఇంకా ఇవ్వట్లేదని గగ్గోలు పెడుతున్నా పట్టించుకోకపోవడం ఆందోళన కలిగిస్తుంది.. ఏపీ లో అయితే పరిస్థితి ఇంకా దారుణంగా ఉంది.. రాష్ట్రం విడిపోయినప్పుడు ఇస్తామన్నా ఒక్క హామీ కూడా ఇంతవరకు నెరవేర్చలేదు సరికదా అడిగితే పొమ్మని అంటున్నది..