రాజకీయాల్లో కొన్ని కాంబినేషన్స్ ఎంతో ఆసక్తి కరంగా ఉంటాయి.. వీరి మధ్య ఎలాంటి పోటీ అయినా చూడడానికి చాలా బాగుంటాయి. అలాంటి కాంబినేషన్ చంద్రబాబు, కేసీఆర్ లది. రాష్ట్రం విడిపోకముందు వీరిద్దరూ కలిసి ఎన్నో సార్లు ఎలక్షన్స్ కి వెళ్లారు.. కలిసి ఒకే మంత్రి వర్గంలో పనిచేశారు. చంద్రబాబు సీఎం గా ఉంటే కేసీఆర్ కి తన మంత్రి వర్గంలో ఎన్నో ఛాన్స్ లు ఇచ్చారు.. అయితే రాష్ట్రం విడిపోయాక మాత్రం సీన్ రివర్స్ అయ్యింది. ఇద్దరి మధ్య పచ్చిగడ్డి వేస్తే భగ్గుమనే స్థాయిలో ఈ ఇద్దరి మధ్య వైరం మొదలైపోయింది.. అందుకు కారణం 2014 ఎలక్షన్స్ లో, 2019 ఎలక్షన్స్ లో చంద్రబాబు కేసీఆర్ కి వ్యతిరేకంగా ప్రచారం చేయడమే..