తెలంగాణ లో రాజకీయాలు ఇప్పుడు ఎంతో ఆసక్తి కరంగా మారాయని చెప్పొచ్చు.. ఇన్నిరోజులు వన్ సైడ్ వార్ తో పెద్దగా ఆసక్తి గా లేని తెలంగాణ రాజకీయాలు దుబ్బాక లో బీజేపీ విజయం తో మరింత రసవత్తరంగా తయారయ్యాయి. దుబ్బాక విజయం బీజేపీ లో ఎప్పుడు లేని జోష్ ని, ఉత్సాహాన్ని తెచ్చింది. అధికార పార్టీ టీ ఆర్ ఎస్ పై విజయం సాధించడంతో తెలంగాణ లో తమదే సెకండ్ పార్టీ అని అనుకంటున్నారు. కాంగ్రెస్ పార్టీ ఇక ఇక్కడ నిలబడలేదని దుబ్బాక లో పరాజయం తో తేలిపోయింది. దానికి తోడు పార్టీ లో వర్గ భేదాలు కూడా పార్టీ పతనానికి పునాది అయ్యింది.. అయితే బీజేపీ ఇక్కడ సాధించిన గెలుపుతో గ్రేటర్ లో కూడా సాధ్యమైనంత సీట్లు ఊద్చేయాలని భావిస్తుంది..