తెలుగు రాష్ట్రాల్లో బీజేపీ చూపిస్తున్న దూకుడు చూస్తుంటే ఖచ్చితంగా వచ్చే ఎన్నికల నాటికి అధికార ప్రభుత్వాలకి కొంత తలనొప్పిగా మారే అవకాశం కనిపిస్తుంది.. ఆంధ్ర సంగతి ఏమో కానీ తెలంగాణ లో కేసీఆర్ కి మంచి పోటీ బీజేపీ ఇవ్వనుందని తెలుస్తుంది.. ఇప్పటికే పంటికింద రాయిలా అన్ని వ్యవహారాల్లో తలదూరుస్తూ కేసీఆర్ తలనొప్పిని తీస్తుండగా నాలుగు ఎంపీ సీట్లు గెలుచుకుని తాజాగా దుబ్బాక ఎమ్మెల్యే సీటును గెలుచుకుని తాము కూడా స్ట్రీమ్ లైన్ లో ఉన్నట్లు బీజేపీ చెప్పకనే చెప్పింది.. ముఖ్యంగా కేంద్రమంత్రి అయ్యాక కిషన్ రెడ్డి, అధ్యక్షుడు అయ్యాక బండి సంజయ్ మరో గేర్ వేసి అధికార ప్రభుత్వానికి చుక్కలు చూపిస్తున్నట్లు వారి కార్యక్రమాల ద్వారా అర్థమవుతుంది.