ఇన్నాళ్లు తెలంగాణాలో టిఆర్ఎస్ పార్టీ కి ఎదురు లేదన్నది వాస్తవం.. అయితే ఎప్పుడైతే బీజేపీ ఎంటర్ అయి నాలుగు ఎంపీ సీట్లు గెలుచుకుంటుందో అప్పుడే టీ ఆర్ ఎస్ కు కొత్త తలనొప్పులు మొదలయ్యాయి అని చెప్పొచ్చు.. ఆ తలనొప్పి ఎంత పెద్దదిగా తయారైందంటే మొన్నటి ఎలక్షన్స్ లో చేతిలో ఉన్న దుబ్బాక ఎమ్మెల్యే సీటు ను కోల్పోవడం వరకు వచ్చింది.. దుబ్బాక లో అధికార పార్టీ ని ఓడించి బీజేపీ పార్టీ గెలిచి చరిత్ర సృష్టించింది.ఇక ప్రజల్లో ఎలాంటి బలం లేని కాంగ్రెస్ పార్టీ , ఒక్క నాయకుడు కూడా సరిగ్గా లేని కాంగ్రెస్ పార్టీ అయితే నిజంగా అధికారంలోకి వస్తున్నట్లు మాట్లాడడం టిఆర్ఎస్ నేతలకె కాదు కాంగ్రెస్ నేతలకు సైతం నవ్వు తెప్పిస్తుంది..