దుబ్బాక ఉప ఎన్నిక ఫలితం తెలంగాణాలో ప్రతిపక్షం ఎవరో తేల్చేసింది చెప్పొచ్చు.. ఇక్కడ కాంగ్రెస్ పార్టీ ఘోర పరాజయం పాలవడంతో ఇక రాష్ట్రంలో కాంగ్రెస్ ఉనికి కష్టమని తెలిసిపోయింది.. కాంగ్రెస్ లో హేమా హేమాలు ప్రచారం చేసినా కూడా కాంగ్రెస్ కనీస పోటీ ని కూడా ఇవ్వకపోవడం ఆ పార్టీ కి పెద్ద అవమానాన్ని మిగిల్చిందని చెప్పొచ్చు. అయితే కాంగ్రెస్ లో ఉంటే తమ రాజకీయ భవిష్యత్ అంధకారమవుతుందని భావించి కొందరు నేతలు ఇతర పార్టీ లకు వెళ్లిపోతున్నారు.. అయితే కాంగ్రెస్ ముఖ్య నేతలు రేవంత్ రెడ్డి, ఉత్తకుమార్, జగ్గారెడ్డి లు ఏం చేస్తారన్నది అసలు ప్రశ్న.. కాంగ్రెస్ లో కేసీఆర్ ని ఎఎక్కువగా విమర్శించేది రేవంత్ రెడ్డి అని చెప్పొచ్చు.