వైసీపీ పార్టీ లో జగన్ పై కొందరి నేతల్లో అసంతృప్తి మొదలైంది అని చెప్పొచ్చు. వెంకటగిరి, గూడూరు నియోజకవర్గాల్లో పట్టున్న నేదురుమిల్లి జనార్థన్ రెడ్డి కుమారుడు రామ్ కుమార్ రెడ్డి జగన్ తనను పక్కన పెట్టడం మింగుడుపడడం లేదట.. అధికారంలోకి వస్తే పదవి ఇస్తానని నాడు జగన్ రామ్ కుమార్ రెడ్డికి హామీ ఇచ్చారు. అయితే పదిహేడు నెలలు గడుస్తున్నా నేదురుమిల్లి రామ్ కుమార్ రెడ్డిని జగన్ పట్టించుకోవడం లేదు. ఇటీవల నెల్లూరు జిల్లాలో పర్యటించిన పార్టీ జిల్లా ఇన్ ఛార్జి సజ్జల రామకృష్ణారెడ్డిని కలసి తన గోడును నేదురుమిల్లి చెప్పుకున్నారట. తన సంగతేంటని సజ్జలను రామ్ కుమార్ రెడ్డి ప్రశ్నించారు. ఈ విషయాన్ని తాను జగన్ దృష్టికి తీసుకెళతానని చెప్పి సజ్జల తప్పించుకున్నారని సమాచారం.