తెలంగాణ లో ఎన్నికలతో రాష్ట్రం మొత్తం ఎంతో ఆసక్తి కర రాజకీయం సాగుతుంది.. ఇన్ని రోజులు కరోనా వల్ల స్థానికంగా జరగాల్సిన ఎన్నికలు జరగలేదు. వాయిదాపడ్డాయి.. ఇప్పుడుకరోనా తగ్గుముఖం పడుతుండడంతో మిగిలిన ఎన్నికలు పూర్తి చేయడం కోసం కేసీఆర్ త్వరపడుతున్నారు. ఇప్పటికే దుబ్బాక ఎన్నికలు పూర్తి అయ్యాయి.. ఇప్పుడు గ్రేటర్ ఎన్నికల నోటిఫికేషన్ కూడా వచ్చింది.. డిసెంబర్ 1వ తేదీన పోలింగ్ నిర్వహిస్తామని ఎస్ఈసీ పార్థసారధి చెప్పారు. తక్షణమే కోడ్ అమలులోకి వస్తుందని వెల్లడించారు. రేపటి నుంచి ఈ నెల 20వ తేదీ వరకూ నామినేషన్లు స్వీకరించనున్నారు. డిసెంబర్ 4వ తేదీన లెక్కింపు చేపట్టనున్నారు. ఈ ఎన్నికలను బ్యాలెట్ పద్ధతిలో నిర్వహించనున్నారు.