ఏపీ లో బీజేపీ జనసేన ల పొత్తు ఎలా సాగుతుందో తెలీదు కానీ తెలంగాణ గ్రేటర్ ఎన్నికల్లోమాత్రం ఎవరికీ వారే యమునా తీరే అన్నట్లు ఎన్నికల్లోకి వెళతారనిపిస్తుంది. ఇప్పటికే హైదరాబాద్ గ్రేటర్ ఎన్నికల్లో జనసేన పోటీ చేయాలనీ నిర్ణయించింది. దాంతో తెలంగాణాలో జనసేన పోటీ చేయబోతుందంటూ పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్నారు జనసేన కార్యకర్తలు.. ఏపీ లో ఒక్క సీటు తో సరిపెట్టుకున్న జనసేన పార్టీ ఆ తర్వాత జరిగిన రాజకీయ పరిణామాల దృష్ట్యా బీజేపీ తో పొత్తు పెట్టుకోవాల్సి వచ్చింది. అయితే మధ్య లో బీజేపీ తో పొత్తు వీగిపోతుందని వార్తలు వచ్చిన ఎక్కడ ఎవరు దీనిపై స్పందించలేదు.. దాంతో బీజేపీ తో జనసేన పొత్తు ఇంకా పదిలంగానే ఉందని అనుకున్నారు.