తెలంగాణ లో గ్రేటర్ ఎన్నికల హడావుడి నిన్నటి నోటిఫికేషన్ తో మొదలైంది అని చెప్పొచ్చు. దుబ్బాక ఎన్నికల ఫలితంతో కేసీఆర్ ఈ ఎన్నికలు ఇప్పట్లో నిర్వహించరని అందరు అనుకున్నారు. కానీ అందరి అంచనాలకు బిన్నంగా కేసీఆర్ గ్రేటర్ ఎన్నికలను పదిరోజుల వ్యవధిలో నిర్వహించి అందరికి షాక్ ఇచ్చాడు.. దుబ్బాక లో గెలిచిన ఆనందం కూడా బీజేపీ కి లేకుండా చేశాడు కేసీఆర్.. ఇప్పటికిప్పుడు అన్ని సీట్లకు అభ్యర్థులను ఎంపిక చేయాలంటే కుదరనిపని.. ఈ ఎత్తు తో కేసీఆర్ గ్రేటర్ ఎన్నికల విషయంలో మంచి ఎత్తు వేశాడని పార్టీ లో చర్చ జరుగుతుంది.