ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొన్ని కొన్ని సార్లు రాజకీయాలు ఎంత గమ్మత్తుగా ఉంటాయంటే నాయకులూ వేసే ఎత్తులకు కాలమే పై ఎత్తులు వేసి వారికి దిమ్మ తిరిగే షాక్ ఇస్తుంది.. ఆ పార్టీ అధికారంలో ఉండాలి కదా అని అందులోకి వెళితే కాలం నిర్ణయం మరోలా ఉంటుంది.. చేతులు కాలాయని తెలుసుకునే లోపు ఆకులు దొరకవు.. ఇప్పుడు రాష్ట్రంలో ని కొంతమంది నేతల పరిస్థితి అలానే ఉంది.. చంద్రబాబు హయాంలో 23 మంది వైసీపీ ఎమ్మెల్యేలు టీడీపీ లోకి ఫిరాయించిన సంగతి తెలిసిందే.. ఆ శాపమే ఇప్పుడు చంద్రబాబు ను వెంటాడింది అనుకోండి..