రాజకీయాలు సెన్సేషన్ అవకపోతే అది రాజకీయమే కాదు. ఎప్పుడు ఏ పార్టీ నెగ్గుతుందో ఎవరికీ తెలుసు.. ప్రజలు ఏ పార్టీ ఎప్పుడు నమ్ముతారో ఎవరికీ తేలేదు.. అందుకు ఉదాహరణ ఏపీ లో టీడీపీ పార్టీ ఓటమి, దుబ్బాక లో టీ ఆర్ ఎస్ పార్టీ ఓటమి..అయితే ఈ దుబ్బాక ఉప ఎన్నికల్లో బీజేపీ విజయం నుంచి తెలుసుకోవాల్సింది చాలా ఉంది. ఎందుకంటే ఒక అధికారంలో ఉన్న పార్టీ ని ఎలాంటి బలం లేని పార్టీ ఓడించిందంటే వారు ఎంత గా ప్రజల్లో నమ్మకం సాధించారో అర్థం చేసుకోవచ్చు. అదే సమయంలో బీజేపీ పార్టీ ప్రజల్లోకి ఎలా దూసుకెళ్ళిందో కూడా అర్థం చేసుకోవచ్చు.. ఎంత కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ పార్టీ కి తెలంగాణ లో అస్సలు బలం లేని స్థాయి నుంచి నాలుగు ఏమీ సీట్లు, రెండు అసెంబ్లీ సీట్లు గెలుచుకునే స్థాయికి వచ్చిందంటే బీజేపీ ఎంత బలపడిందో అర్థం చేసుకోవచ్చు.