టీడీపీ లో సరైన లీడర్లు లేక నియోజకవర్గాల్లో పార్టీ రోజు రోజు కి కృంగిపోతుంది..దీనికి తోడు టీడీపీ గత ఎన్నికల్లో ఎంత దారుణంగా ఓడిపోవడం పెద్ద మైనస్ గా మారింది. చంద్రబాబు అవినీతి, పాలనా సరిగ్గా చేయకపోవడం, టీడీపీ లీడర్లను తన అదుపులో ఉంచుకోకుండా ప్రజలను దోచుకోమని పంపడం వంటివి టీడీపీ ఓటమికి కారణమయ్యాయి. అంతేకాదు టీడీపీ కొన్ని వర్గాలను పట్టించుకోకపోవడం వల్లే ఖంగు తినాల్సి వచ్చింది.. మొదటినుంచి టీడీపీ వర్గ రాజకీయాలు, కుల రాజకీయాలు చేస్తూ నెగ్గుతూ వచ్చింది. అయితే ఈ సారి ఏం చేయకపోయినా సరే సదరు వర్గాలు తమకు మద్దతు ఇస్తామని భావన లో ఉన్నారో ఏమో టీడీపీ దారుణంగా ఓటమి చెందడానికి ఆ వర్గాలు కారణమయ్యాయి..