రెండు రోజుల మంగళగిరి పర్యటనలో బిజీబిజీగా పార్టీ కార్యకర్తలతో సమావేశం అయినా అయన ముందస్తు జమిలీ ఎన్నికలు వస్తాయని ప్రకటించారు.2024 కంటే ముందే ఎన్నికలు వచ్చే అవకాశం ఉందని.. ఈ మేరకు తనకు సమాచారం ఉందని పవన్ కల్యాణ్ ప్రకటించారు.దేశవ్యాప్తంగా జమిలీ ఎన్నికలపై విస్తృతమైన చర్చ జరుగుతోది. ఒకే దేశం.. ఒకే విధానం.. బీజేపీ కాన్సెప్ట్. ఈ నినాదంతో జమిలీ ఎన్నికలు నిర్వహించడానికి వీలైనంత త్వరగా కసరత్తు పూర్తి చేసి 2022లోనే దేశవ్యాప్తంగా జమిలీ ఎన్నికలు నిర్వహించే అవకాశం ఉందన్న ప్రచారం జోరుగా సాగింది. 2022లో జమిలీ ఎన్నికలు అనే ప్రతిపాదనకు ఓ ప్రాతిపదిక ఉంది. ఆ ఏడాది దాదాపుగా ఎనిమిది రాష్ట్రాలకు అసెంబ్లీ ఎన్నికలు జరగాల్సి ఉంది.