తెలంగాణ బీజేపీ పార్టీ అధ్యక్షుడు బండి సంజయ్ ఇటీవలే దుబ్బాక లో పార్టీ ని గెలిపించడంలో ఎంతో కృషి చేశారు..నిజంగా అధికారంలో ఉన్న పార్టీ ని కాదని బీజేపీ కి ప్రజలు ఓట్లు వేశారంటే బండి సంజయ్ ప్రజల మనసులు గెల్చుకుపోవడం లో కీలక పాత్ర వహించాడని చెప్పొచ్చు. దుబ్బాక లో రఘునందన్ రెడ్డి గెలుపుకు ప్రధాన కారణం బండి సంజయ్ అని అయన కూడా చాలా సార్లు చెప్పారు. అయితే దుబ్బాక లో గెలిచి విజయోత్సాహం లో ఉన్న బీజేపీ కి గ్రేటర్ ఎలక్షన్స్ పెద్ద మైనస్ గా చెప్పాలి.. ఎందుకంటే దుబ్బాక విజయాన్ని సంబరాలు చేసుకునే మూడ్ లో బీజేపీ ఉంటే కేసీఆర్ గ్రేటర్ ఎన్నికల నోటిఫికేషన్ ని రిలీజ్ చేశారు..