గత ప్రభుత్వ హయాంలో తప్పు మీద తప్పు చేసి ప్రజల నమ్మకాన్ని కోల్పోయి ఎన్నికల్లో ఓటమి చవి చూసిన చంద్రబాబు లో ఇప్పటికీ ఎలాంటి మార్పు జరగలేదు.. జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా ప్రజలు ఏరికోరి తెచ్చుకున్న జగన్ ని విమర్శించి వారి కోపానికి గురవవుతున్నాడు. ప్రజల దృష్టి లో విలన్ గా మారిపోయి చంద్రబాబు ఏం సాధిస్తాడా తెలీదు కానీ ఇప్పటికే తప్పు మీద తప్పు చేస్తూ టీడీపీ ని విలన్ గా చిత్రీకరించడం లో సక్సెస్ అయ్యాడు. ఇక తిరుపతి ఉప ఎన్నిక లో పనబాక లక్ష్మి ని టీడీపీ అభ్యర్థి గా ప్రకటించిన చంద్రబాబు ఇప్పుడు మరో తప్పు చేశారు..