దుబ్బాక లో ఓడిపోయినా భయం కేసీఆర్ కి పట్టుకున్నట్లు గా అనిపిస్తుంది.. తెలంగాణ లో ఇంతవరకు కేసీఆర్ చెప్పిందే వేదం.. అయన అమలుచేసిందే శాశనం. అలాంటిది కేసీఆర్ కి ఇక్కడ దుబ్బాక ఎన్నికల్లో ఫలితం పెద్ద షాక్ ఇచ్చిందని చెప్పొచ్చు.. నిజానికి కేసీఆర్ పై వ్యతిరేకత ఈ అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచినా దగ్గరినుంచే వుంది. సచివాలయం కూల్చివేత, కరోనా ఇబ్బందులు అన్ని కలిసి కేసీఆర్ మెడకు చుట్టుకున్నాయి. దాంతో ఆటోమేటిక్ గా కేసీఆర్ పాపులారిటీ తగ్గిపోయింది.. ఇదే సమయంలో బీజేపీ కూడా నాలుగు ఎంపీ సీట్లు గెలుచుకోవడంతో ప్రజలు కొత్త పార్టీ అధికారానికి చూస్తున్నారని తేలిపోయింది..