విజయ సాయి రెడ్డి పై విశాఖ ప్రాంతంలోని వైసీపీ నేతలు రోజుకో విమర్శ చేస్తున్నారు.. సొంత పార్టీ నేతలే ఇలా విమర్శిస్తుండడంతో అధిష్టానానికి ఈ వ్యవహారం తలనొప్పిగా తయారైంది. ఇక్కడ ల్యాండ్ మాఫియా గురించి వైసీపీ నేతలు ఒకరినొకరు విమర్శించుకుంటున్నారు. దాంతో ఆగ్రహం వ్యక్తం చేసిన సీఎం జగన్ వెంటనే ఎవరైతే విమర్శించారో వారిని పిలిపించుకుని క్లాస్ పీకుతున్నారట. భూదందాలు విషయంలో వైసీపీ నేతలే బాహాటంగా చర్చకు పెట్టడంతో జగన్ కు ఆగ్రహం తెప్పించిందంటున్నారు. విశాఖను పరిపాలన రాజధాని చేయాలని నిర్ణయించడంతో విశాఖ వైసీపీ నేతల మధ్య విభేదాలు జగన్ కు చికాకు తెప్పించాయంటున్నారు.