రాష్ట్రంలో బీజేపీ నేతలకు ఇప్పుడు కొత్త ఉత్సాహమిచ్చిందని చెప్పొచ్చు.. తెలంగాణ లో ఇటీవలే జరిగిన దుబ్బాక ఎన్నికల ఫలితం అక్కడేమో కానీ ఏపీ లో నేతలకు కొత్త జోరునిచ్చింది. అందుకే వారిలో ఎక్కడలేని ఉత్సాహం కలిగిస్తుంది. అక్కడికేదో వారే పార్టీ ని గెలిపించినట్లు ఫీల్ అయిపోతారు. ఏపీ లో పరిస్థితి ఎక్కడ వేసిన గొంగడి అక్కడే ఉండిపోయింది.. ఆమధ్య పార్టీ ని బలోపేతం చేయడానికి సోము వీర్రాజు కొంత హడావుడి చేసిన ఇప్పుడెందుకు సైలెంట్ గా ఉన్నారు.. అధికార పార్టీ ప్రజల్లోకి దూసుకెళ్తున్న ఎక్కడా బీజేపీ పార్టీ విమర్శించకపోవడం వారికి సడెన్ గా ఏమైంది అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి..