తెలంగాణ సీఎం కేసీఆర్ గతంలో ఎప్పుడు లేనివిధంగా ప్రతిపక్షాలచే నిందించబడుతున్నారు.. కరోనా వ్యాప్తి ని అరొకట్టలేకపోయారని, సచివాలయాన్ని కూల్చివేస్తున్నారని, ఉస్మానియా ఆసుపత్రి వివాదం, శ్రీశైలం ప్రమాదం విషయం ఇలా అన్ని విషయాల్లో కేసీఆర్ ని విపక్షాలు టార్గెట్ చేసి ఒక్కసారిగా దండెత్తాయి.. ఇలా కేసీఆర్ పై ఏమాత్రం భయపడకుండా అయన పై విమర్శలు చేసిన నాయకులలో రేవంత్ రెడ్డి ముందు ఉంటారు.. కాంగ్రెస్ పార్టీ లో అంత యాక్టివ్ గా ఎవరు లేకపోయినా రేవంత్ రెడ్డి మాత్రం కేసీఆర్ ని అందరికంటే ఎక్కువ గా విమర్శితు టీ ఆర్ ఎస్ లో చర్చకు కారణం అవుతున్నారు.. కేసీఆర్ సీఎం అయ్యింది ఫామ్ హౌస్ లో పడుకోవడానికి అని, పాలన మీద దృష్టి పెట్టకుండా తాగి తందానాలు ఆడుతున్నారని కేసీఆర్ ఇమేజ్ ని డ్యామేజ్ చేసే ప్రయత్నం చేశారు..