తెలంగాణాలో రాజకీయ చాణక్యుడిగా కేసీఆర్ కి మంచి పేరుంది.మంచి వాగ్దాటి ఉన్న అతి తక్కువ రాజకీయ నాయకుల్లో అయన ఒకరు. అయన మాట్లాడితే ఎంతటి శత్రువు అయినా యిట్టె కరిగిపోతారు. ప్రజలను చైతన్యవంతుల్ని చేయడంలో ఆయనకు ఆయనే సాటి అందుకే తెలంగాణ ఉద్యమంలో అయన విజయం సాధించారు.. ఇప్పుడు రెండు సార్లు అధికారంలోకి వచ్చారు.. ఎదుటి వారిని విమర్శించేటప్పుడు కొంచెం చతురత మిళితం చేసి ప్రజలను ఆకట్టుకోవడం కేసీఆర్ కి అలవాటు.. ఏ మాత్రం తొట్రుపాటు లేకుండా ఎదుటి వారిమీద కామెడీ పంచ్‌లు మాంచి ఈజ్‌తో వేయడంలో కేసీఆర్ కి పరిపాటి ఎవరు లేరు..